రాశీఖన్నా హీరోయిన్ అవ్వడానికి Vaseline కారణమైంది! దాని వెనుకున్న స్టోరీ ఏంటంటే….. రాశీఖన్నా ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆ కాలేజ్ కు Vaseline కంపెనీ వారు తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడానికి వచ్చారు. ఆ ప్రమోషన్ లో భాగంగా అక్కడి అమ్మాయిలకు ఓ ఆఫర్ ఇచ్చారు.Vaselineను చేతిలో పెట్టుకొని నచ్చిన స్టిల్ లో ఒక ఫోటో దిగి ఆ Vaselineను ఫ్రీగా తీసుకోమన్నారు.
Advertisement
Advertisement
ఫ్రెండ్స్ తో పాటు రాశీఖన్నాను కూడా తనదైన స్టైల్ ఫోజ్ ఇస్తూ ఓ ఫోటో దిగింది. కట్ చేస్తే Vaseline కంపెనీ వారికి రాశి అందం, ఆమె స్టైల్ నచ్చడంతో ఆమె ఫోటోతోనే ఆ కంపెనీ ప్రకటనలను కొనసాగించింది. ఆ యాడ్ ను గమనించిన డైరెక్టర్ సుజిత్ రాశిని తన మద్రాస్ కేఫ్ అనే సినిమాలోకి తీసుకున్నాడు. అటు తర్వాత అవసరాల శ్రీనివాస్ఊహలు గుసగుసలాడే లో తీసుకున్నారు. ఆతర్వాత అనేక సినిమా ఆఫర్స్ వచ్చాయి.
ఇక చదువు విషయంలో రాశీ టాప్ స్టూడెంట్. సివిల్స్ యే లక్ష్యంగా పెట్టుకున్న రాశీకి సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో తన కెరీర్ ను సివిల్స్ నుండి సినిమాలకు మార్చుకుంది.