Home » లవ్ లైఫ్ కోసం అవ్వని చెయ్యాలి.. అంత టైం లేదు నాకు..!

లవ్ లైఫ్ కోసం అవ్వని చెయ్యాలి.. అంత టైం లేదు నాకు..!

by Azhar
Ad
టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో ఉంది రష్మిక మందాన. అయితే గత ఏడాది వచ్చిన పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ అనేది మారిపోయింది. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన పుష్ప సూపర్ హిట్ కావడంతో రష్మికకు హిందీలో కూడా అవకాశాలు అనేవి పెరిగాయి. ఈ క్రమంలోనే రష్మిక లవ్ లో ఉంది అంటూ వార్తలు అనేవి ప్రారంభం అయ్యాయి.
గతంలో కూడా రష్మిక లవ్ లైఫ్ గురించి చాలానే వార్తలు వచ్చాయి. అయితే వాటిని కొట్టిపారేసిన రష్మిక తాజాగా మరోసారి లవ్ లైఫ్ గురించి మాట్లాడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను అని తెలిపింది. అలాగే తన లవ్ లైఫ్ గురించి మాట్లాడిన రష్మిక.. మన పాట్నర్ కు మనం సమయం అనేది బాగా ఇవ్వాలి.
అతనితో ఎక్కువ సమయం గడపాలి. అలాగే ఈ రిలేషన్ ను నిలబెట్టుకోవడానికి సమయంతో పాటుగా ఓర్పు, సహనం కూడా ఉండాలి. కానీ నేను ఇప్పుడు నేను బిజీ షెడ్యూల్స్ తో ఉన్నాను. నా ఫ్యామిలీ.. ఫ్రెండ్స్ కే నేను సమయం ఇవ్వలేకపోతున్నాను అని పేర్కొంది. అదే విధంగా ఇప్పుడు తాను ఎవరితో కూడా రిలేషన్ లో లేను అనే క్లారిటీ కూడా ఇచ్చింది రష్మిక మందాన.

Advertisement

Visitors Are Also Reading