ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఎలాగైనా రాణించవచ్చు. అయితే హీరోలకు స్టార్ డమ్ వస్తే మాత్రం ఇండస్ట్రీలో కోదువ ఉండదు. కానీ హీరోయిన్లు మాత్రం సినిమా ఫ్లాపయితే వారికి భవిష్యత్తు ఉండదు. సాధారణంగా హీరోయిన్లు స్టార్ హీరోయిన్ అయిన ఐదు నుంచి పది సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలరు. ఈ సమయంలోనే వారు కావాల్సినంత సంపాదించుకుంటారు. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ.. తన నటనా టాలెంట్ తో సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.. ఇంతకు ఆమె ఎవరంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..
Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే ఆమె చేతిలో ఎనిమిది కి పైగా సినిమాలు ఉన్నాయి. మరిన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టుకొని రెడీగా ఉంది. సినిమాల విషయంలో కూడా ఆచితూచి కథలు ఎంచుకుంటూ ముందుకు పోతోంది. పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన హీరోయిన్ డబ్బు ఎక్కువ సంపాదించాలి అనుకుందో ఏమో ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ పెంచేసింది.
Advertisement
దాదాపుగా నాలుగు కోట్ల పైగానే ఒక సినిమాకు తీసుకుంటుందట. ఈ అమ్మడు రేంజ్ ఈ స్థాయిలో పెరిగిపోవడానికి కారణం ఈమె నటించిన సినిమాలు వరుసగా విజయాలు అందుకోవడమే అని, అలాగే ఇండస్ట్రీ లో ఆఫర్లు రావడం వల్లే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ మిగతా హీరోయిన్లకు గట్టి కాంపిటీషన్ ఇస్తూ ఇండస్ట్రీ లో కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓకే చెప్పిన ప్రాజెక్టులలో మంచి విజయం అందుకుంటే మాత్రం రష్మిక నయనతార ని దాటి పారితోషికం తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.
ALSO READ;