Home » గీతా ఆర్ట్స్ నుంచి రష్మిక లేడీ ఓరియంటేడ్ మూవీ టైటిల్ రివీల్..!

గీతా ఆర్ట్స్ నుంచి రష్మిక లేడీ ఓరియంటేడ్ మూవీ టైటిల్ రివీల్..!

by Anji
Ad

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీతో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. పుష్ప మూవీతో ఈ అమ్ముడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ నటి ఇప్పుడు ది గర్ల్ ఫ్రెం్ అనే లేడీ ఓరియంటేడ్ మూవీకి సిద్ధమైంది.

Advertisement

చి.ల.సౌ. సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కుతున్నట్టు రష్మిక ప్రకటించింది. ఈ మేరకు గ్లింప్స్ ను కూడా మేకర్స్ వదిలారు. ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించేందుకు సర్వం కోల్పోయాను అనుకొని లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి.. వీరిద్దరి ప్రేమ గాధ ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించినట్టు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ లాస్ట్ సినిమా మన్మధుడు 2 డిజాస్టర్ గా నిలిచింది. హీరోయిన్ కెరీర్ టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలోనే లేడీ ఓరియేంటే్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వం అంటే.. ఇది  రష్మిక చేస్తున్న పెద్ద సాహసమనే చెప్పాలి.

Advertisement

ఖుషీ ఫేమ్ అబ్దుల్ హేషమ్ వాహద్ సంగీత దర్శకుడిగా ఉండగా.. గీతా ఆర్ట్స్, మాస్ మేకర్స్ బ్యానర్ లపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లో మరో లేడీ ఓరియంటేడ్ చిత్రం రష్మిక చేస్తున్న విషయం విధితమే. రెయిన్ బో అనే లేడీ ఓరియంటేడ్  మూవీని ఆమె ఇప్పటికే ప్రారంభించింది. ఈ సినిమాలో శాంతరూబన్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. రొ*మాంటిక్ ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్ మోహన్ కూడా నటించనున్నారు. ఈ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.

 

Visitors Are Also Reading