Home » ఒకే ఇంట్లో కాపురం పెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక ?

ఒకే ఇంట్లో కాపురం పెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక ?

by Bunty
Ad

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం ‘గీతా గోవిందం’. ఈ సినిమా హిట్ అవ్వడం ఏంటో కానీ అప్పటి నుంచి వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, వెకేషన్ కి వెళ్ళారని, వివాహం చేసుకోబోతున్నారంటూ ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.

Rashmika and Vijay Deverakonda unofficially confirming that they're living together

Rashmika and Vijay Deverakonda unofficially confirming that they’re living together

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు రష్మిక కూడా రెండు పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఇక ఈ మధ్యకాలంలో రష్మిక తన అసిస్టెంట్ వివాహానికి హాజరయ్యారు. ఆ వివాహానికి తాను సారీలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇక కొత్త జంటను ఆశీర్వదించి సందడి చేసింది రష్మిక. ఇక ఆ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్లో పంచుకుంది. దీంతో నెటిజన్స్ ఆ ఫోటోలో మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు.

Advertisement

Advertisement

తాను పోస్ట్ చేసిన ఫోటోలో రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో ఉంది ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ కూడా పోస్ట్ చేసిన ఫోటోలో ఇల్లు అచ్చం అలానే ఉంది. దీంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారా? లేకపోతే రష్మిక, విజయ్ దేవరకొండ ఇంటికి సరదాగా వచ్చిందా? అనే కొత్త అనుమానం కలిగింది. అయితే ఓ సందర్భంలో రష్మిక మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని, మేమిద్దరం మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పుకొచ్చింది. స్నేహం తప్ప మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని విజయ్, రష్మిక ఇద్దరూ చెప్పినా కూడా ఎవరు నమ్మడం లేదు. ఈ విషయంపై వారిద్దరూ క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం తెలియదు.

ఇవి కూడా చదవండి

Chiranjeevi : ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన సురేఖ..కానీ చివరికి..?

వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌.. యుజ్వేంద్ర చాహల్‌ కీలక నిర్ణయం!

MS Dhoni : ఇదేం క్రేజ్ బ్రో.. ఏకంగా ట్రంప్ తోనే ధోని ఆటలు

Visitors Are Also Reading