టాలీవుడ్ నటి రాశీకన్నా ఇటీవల చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన సినిమాలు రొటీన్ గా ఉంటాయని…హీరోయిన్ రొమాంటి సన్నివేశాలలో కనిపించి వెళ్లిపోతుందని రాశీకన్నా వ్యాఖ్యానించింది. అంతే కాకుండా హీరోయిన్ కు గుర్తింపు ఉన్న పాత్రలు ఉండవని తనకు ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉండే పాత్రలు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా తనలో ఇప్పటి నుండి కొత్త నటిని చూస్తారని రాశీకన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
Advertisement
రాశీకన్నా చేసిన వ్యాఖ్యలు మీడియాలో రావడంతో దక్షిణాది అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీపైనే ఎలా కామెంట్లు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తాజాగా రాశీ కన్నా ఈ ఇష్యూపై స్పందించింది. దక్షిణాది పరిశ్రమను దూశించా అంటూ తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని వ్యాఖ్యానించింది. ఏ చిత్రపరిశ్రమ అయినా ప్రతి పాత్రనూ తాను గౌరవించి చేస్తానని చెప్పింది. దయచేసి తనపై తప్పుడు ప్రచారాన్ని ఆపాలని కోరింది.
Advertisement