ఐపీఎల్… బీసీసీఐ 2008 లో ప్రారంభించిన ఈ లీగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మధ్యే మన బీసీసీఐ రాబోయే 5 ఏళ్లకు మీడియా హక్కులను వేలం వేయగా 43 వేళా కోట్లకు పైగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన ఈ ఐపీఎల్ ను చూసి ఇంకా చాలా లీగ్స్ పుట్టుకువచ్చాయి కానీ అవి ఐపీఎల్ ఆంత ఆదరణ దకించుకోలేదు. అందులో పాకిస్థాన్ క్రికెట్ లీగ్ కూడా ఉంటుంది. మన ఐపీఎల్ లో ఒక్క ఆటగాడు అమ్ముడుపోయే ధర అంత కూడా దీని రేట్ అనేది ఉండదు.
Advertisement
అందుకే మన ఐపీఎల్ ను చూసి ఓర్వలేక చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లు మన లీగ్ పైన ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు అందులో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా చేరిపోయాడు. తాజాగా లతీఫ్ ఐపీఎల్ పైన నోరు పారేసుకున్నాడు. ఐపీఎల్ అంటే కేవలం డబ్బు మాత్రమే అని కామెంట్స్ చేసాడు. లతీఫ్ మాట్లాడుతూ… ఐపీల లో కేవలం బిజినెస్ మాత్రమే జరుగుతుంది. అందుకే అక్కడ ఆటలో క్వాలిటీ అనేది లేదు. ఇది అసలు సరైన పద్ధతి కాదు.
Advertisement
అయితే మనం ఐపీఎల్ గురించి మాట్లాడేటప్పుడు క్రికెట్ గురించి మాట్లాడకూడదు. కేవలం డబ్బుల గురించి మాత్రమే మాట్లాడాలి. అక్కడ వారికీ కేవలం డబ్బు ఒక్కటే ప్రధానం. ఇందులో నాణ్యమైన క్రికెట్ లేదు. మీరు భారత ప్రజలను అడగండి ఐపీఎల్ లో మ్యాచ్ ఎంత సేపు చూస్తారు అని.. మీకే మొత్తం అర్ధం అవుతుంది. అది మొత్తం కమర్షియల్ బిజినెస్. అయితే మన చూడాలి ఇంకా ఇలానే వీరు ఎన్ని రోజులు దీనిని నడిపిస్తారు అనేది అని లతీఫ్ అన్నాడు. అయితే మన ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లకు ఆడే అవకాశం లేదు. అందుకే అక్కడి వారు ఇలా యష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు.
ఇవి కూడా చదవండి :