టాలీవుడ్ లోని గొప్ప నటీమణుల్లో నిర్మలమ్మ కూడా ఒకరు. ఆమె అసలు పేరు రాజామణి కాగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిర్మలమ్మ గా పేరు మార్చుకుంది. నిర్మలమ్మ 1926 జూలై 18న బందర్ లో జన్మించింది.
Advertisement
గంగయ్య కోటమ్మ అనే దంపతులకు 9వ వసంతానంగా నిర్మలమ్మ జన్మించింది.
చిన్న నాటి నుండే నాటకాలు అంటే నిర్మలమ్మకు ఎంతో ఆసక్తి ఉండేది. మూడో తరగతిలోనే చదువు మానేసి నాటకాలలో నటించడం మొదలు పెట్టింది.
దాంతో బంధువులు అంతా పరువు తీస్తుంది అని తిట్టేవారట.మొదట నాటకలతోనే ద్వారానే నిర్మలమ్మ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Advertisement
ఆ తర్వాత సినిమా ఆఫర్లను అందుకుంది. సినిమాల్లో తిరుగులేని నటిగా గుర్తింపు సంపాదించుకుంది. యవ్వనంలో నిర్మలమ్మ ఎంతో అందంగా ఉండేవారు. దాంతో హీరోయిన్ గా కూడా సినిమాలు చేశారు. అయితే ఆ తర్వాత సైడ్ పాత్రకే పరిమితం అవ్వాల్సి వచ్చింది.
అంతేకాకుండా ఏజ్ బార్ అయిన తర్వాత తల్లి ,నానమ్మ లాంటి పాత్రలలో నటించి ఆకట్టుకుంది.నిర్మలమ్మ 1943 సంవత్సరంలో 16 ఏళ్ల వయసుకు సినిమాలో చెలికత్తె పాత్రలో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత నిర్మలమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమాలో వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది.
అయితే నిర్మలమ్మ యవ్వన వయసులో ఉన్నప్పటి ఫోటోలను చాలా మంది చూడలేదు. ఓ సారి రేర్ ఫోటోలపై లుక్ వేయండి.