తెలుగు సినిమా గర్వించదగ్గ నటులలో రావుగోపాల్ రావ్ కూడా ఒకరు. విలన్ పాత్రల్లో నటించి రావ్ గోపాల్ రావు తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. విలజనిజం చూపించడంలో కొత్తరూట్ ను ఎంచుకున్నారు. ఎలాంటి కంగారు లేకుండా కనిపిస్తూ హీరోను టన్షన్ పెట్టే విలన్ గా కనింపిచారు. అంతే కాకుండా విలన్ పక్కన అల్లు రామలింగయ్యలాంటి కమెడియన్ ఉండటం సమయానికి తగినట్టు విలన్ జోకులు పేల్చడం విలన్ పై కూడా జోకులు వేయడం లాంటి రావ్ గోపాల్ రావు సినిమాల నుండే మొదలయ్యాయి.
Advertisement
రావు గోపాల్ రావు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జన్మించారు. నాటకాలపై ఉన్న ఆసక్తితో ఆయన మొదట నాటకరంగంలో రానించారు. అయితే ఓసారి ప్రముఖ నటుడు ఎస్వీరంగారావు రావుగోపాల్ రావు వేసిన ఓ నాటకాన్ని చూసారు. దాంతో వెంటనే ఆనను మాద్రాసు రావాలని కోరారు. ఆ తరవాత రావుగోపాల్ రావు మాద్రాసుకు వెళ్లారు.
Advertisement
ఎస్వీరంగారావు మొదట రావుగోపాల్ రావును దర్శకుడు రామానాయుడికి పరిచయం చేశారు. మొదట రామానాయుడు దగ్గర దర్శకత్వ శాఖలో రావుగోపాల్ రావు చేరారు. రామానాయుడి వద్ద దర్శకత్వశాఖలో పనిచేస్తూనే అడపాదపా పాత్రలు వేసేవారు. ఆ సమయంలో రావుగోపాల్ రావు వాయిస్ విన్న కొంతమంది అసలు ఈ వాయిస్ తో రానించడం కష్టం అని చెప్పాటరట.దాంతో కొన్ని సినిమాలకు రావుగోపారావుకు మరో వ్యక్తి కూడా డబ్బింగ్ చెప్పారట. ఆ సమయంలో తన గొంతు విషయంలో ఆయన కూడా కృంగిపోయారు.
కానీ రావుగోపాల్ రావు గొంతులోని వైవిధ్యాన్ని బాబు, రమణ లాంటి వాళ్లు గుర్తించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా డైలాగులు రాశారు. అలా వచ్చిన ముత్యాల ముగ్గుసినిమాలో రావుగోపాల్ రావు విలనిజం ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరవాత వచ్చిన భక్తకన్నప్ప లో కూడా రావుగోపాల్ రావు పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. అప్పటి నుండి రావుగోపాల్ రావు తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన గొంతును మాత్రం తెలుగు ప్రేక్షకులు మరవలేదు.
ALSO READ :
బేబీ బంప్ వీడియో షేర్ చేసిన శ్రియ.. సోషల్ మీడియాలో వైరల్..!
ఆర్ఆర్ఆర్ కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిన 10 సినిమాలు ఇవే..!!