పరిచయం :
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. మెగావారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వైష్ణవ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరవాత మరోసినిమాగా చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రంగరంగవైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Advertisement
గిరీశాయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. సినిమా ట్రైలర్ చూస్తే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కనిపించింది. ఇక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమాపై సాయిధరమ్ తేజ్ తన స్పీచ్ తో భారీ అంచనాలను పెంచాడు. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయ్యిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం….
సినిమా రివ్యూ :
వైష్ణవ్ కేతికలకు చిన్నప్పుడే పరిచయం ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన కారణంగా మాట్లాడుకోకుండా ఉంటారు. అంతే కాకుండా ఒకరికొకరు దూరంగా వెళ్లిపోతారు. పెరిగి పెద్దయ్యిన తరవాత ఇద్దరూ కూడా డాక్టర్ లు అవుతారు. సినిమాలో కేతిక రాధ పాత్రలో నటించగా వైష్ణవ్ తేజ్ రిషి పాత్రలో నటించాడు. డాక్టర్ వృత్తిలో ఉన్న రిషి అనుకోని సంఘటనల వల్ల ఇబ్బందుల్లో పడిపోతాడు.
Advertisement
ఆ సమస్యల నుండి రిషి ఎలా బయటపడ్డాడు. రిషి రాధలు మళ్లీ కలిశారా లేదా..? అనేదే ఈ సినిమా అసలు కథ. ఈ సినిమాకు దేవి శ్రీ అందించిన మ్యూజిక్ బాగుంది. అంతే కాకుండా సినిమాలో కామెడీ ట్రాక్ కూడా బాగుండటంతో ప్రేక్షకులకు బోర్ కొట్టించలేదు. కథ ఇదివరకూ చూసినట్టే అనిపించినా కథనం కొత్తగా అనిపిస్తుంది.
అంతే కాకుండా సినిమా నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అయితే ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా కొన్ని సంధర్బాల్లో సాగధీతగా అనిపిస్తుంది. ఈ సినిమాకు క్లైమాక్స్ మాత్రం మైనస్ అనే చెప్పాలి. రొటీన్ క్లైమాక్స్ కావడంతో సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కొత్త ఫీల్ ఉండదు. ఇక మొత్తంగా చూసుకుంటే రొటీన్ సినిమానే అయినా ఒకసారి చూడొచ్చు.