టాలీవుడ్ సూపర్ స్టార్ రన్ బీర్ కపూర్ గురించిన ఒక న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో సంచులనం రేపుతోంది. ఎప్పుడు పార్టీలు, పబ్ లు అంటూ నిత్యం జల్సాలు చేస్తుండే రన్ బీర్ కపూర్ గత కొద్ది రోజులుగా ఆల్కహాల్ మరియు నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నాడట. అయితే రన్ బీర్ కపూర్ లో వచ్చిన ఈ సడన్ మార్పుకు కారణం ఏమై ఉంటుందా అని అందరిలో సర్వత్రం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తున్న రన్ బీర్, ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
Advertisement
అయితే ఈ సినిమా వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తెరకెక్కబోతుందట. ఇక ఈ సినిమాలో శ్రీరాముడిగా రన్ బీర్ కపూర్, సీతగా ఆయన భార్య ఆలియా భట్ లేదా సాయి పల్లవి నటించబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమా కోసమే రన్ బీర్ కపూర్ పూర్తి నిష్ఠ తో సినిమా షూటింగ్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ గా ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఏ న్యూస్ రాకపోయిన బాలీవుడ్ మీడియాలో మాత్రం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.
Advertisement
ఇక లేటెస్ట్ గా చూస్తే రన్ బీర్ కపూర్ నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోవడం లేదని వార్త వెలుబడటంతో నితీష్ తివారి రామాయణం గురించి వస్తున్న వార్తలు నిజమేనని అనిపిస్తోంది. అయితే కొద్ది నెలల క్రితమే రామాయణం ఆధారంగా ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ సినిమాను తీశాడు. భారీ వ్యయంతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ తో రామాయణం ఆధారంగా సినిమా వస్తుందనగానే ప్రేక్షకుల్లో ఆందోళన మొదలయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి నెగిటివ్ వాతావరణాన్ని దాటుకొని రన్ బీర్ కపూర్ రామాయణం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
50 ఏళ్ల రజిత పెళ్లి చేసుకోకపోవడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా ?