టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వచ్చి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రానా దగ్గుపాటి ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. తన ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ సాధించారు రానా. ఆ సినిమా తరువాత చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే.. మరికొన్ని సినిమాలు ఫెయిల్యూర్ సాధించాయి. కేవలం హీరోగా మాత్రమే కాకుండా.. కథ ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రల్లో కూడా నటించి సందడి చేస్తున్నారు రానా.
Advertisement
ఇంతకుముందే రానా బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాలో విలన్ గా నటించిన రానా దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. ఇక ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీలో కూడా విలన్ గా నటించారు. ఈ సినిమాలో డానియల్ శేఖర్ పాత్రలో రానా అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. తాజాగా మరొకసారి విలన్ గా రానా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమయ్యాడు.
Advertisement
హాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్పై. ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. జూన్ 29న విడుదల కాబోతున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి ఓ కీలక సన్నివేశంలో విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో రానా మాత్రమే ఈ సినిమాని కీలక మలుపు తిప్పబోతుందని సమాచారం. అసలు రానా ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ మూవీలో స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యం తెలియనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. స్పై మూవీ ద్వారా రానా ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి! మొదటి సారి పాజిటివ్ గా!
50 ఏళ్ల వయసు వచ్చినా కూడా యంగ్ గా కనిపిస్తున్న హీరోలు!