దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రానా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. రానా సినిమాలో ఎలాంటి పాత్ర చేయడానికి ఇష్టపడతాడు. సినిమా ఫ్యామిలీకే చెందినవాడు అయినా గర్వంతో కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాడు. లీడర్ సినిమాతో హీరోగా పరిచమైన రానా ఆ తవరాత చాలా సినిమాలు చేశాడు. అయితే హీరోగా మాత్రం అనుకున్నమేర సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి.
Also Read: చెన్నకేశవరెడ్డి సినిమాకు నో చెప్పిన సౌందర్య.. ఎందుకో తెలుసా..?
Advertisement
కానీ బాహుబలి సినిమాలో విలన్ గా నటించినప్పటికీ పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరవాత దేశవ్యాప్తంగా రానా అంటే తెలియని ప్రేక్షకులు లేరు. అంతే కాకుండా రానా డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. కొంతకాలం పాటూ ఓ టాక్ షోకు హోస్ట్ గా చేసి బుల్లితెరపై కూడా సందడి చేశాడు. ఇదంతా రానా సినిమా సినిమా జీవితం….రానా పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
Advertisement
Also Read: నాగచైతన్య ఆ సినిమాకు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
తాను కొంతకాలం పాటు అనారోగ్యం బారినపడ్డానని రానా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాంతో అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకున్నానని చెప్పాడు. అంతే కాకుండా రానా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనే మిహికబజాజ్ అతడిని ప్రేమ వివాహం చేసుకుని నిజమైన ప్రేమకు నిర్వచనంలా మారింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు.
కానీ నిన్న రానా మిహికాల రెండవ వివాహ వార్షికోత్సవం జరిగింది. అయితే రానా మాత్రం తన ఇన్స్ట్రా గ్రామ్ ఖాతాలోని ఫోటోలు అన్నింటిని డిలీట్ చేశాడు. అందులో తన భార్య మిహికాతో కలిసి ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. కొంతకాలం పాటూ రానా సోషల్ మీడియా నుండి దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక తమ వివాహ బంధంపై ఎలాంటి అనుమానం రాకుండా మిహికా పెళ్లి రోజున వారిద్దరి ఫోటోలను షేర్ చేసింది.
Also Read: SR ఎన్టీఆర్ నిర్మాతగా మారడానికి కారణం ఎవరో తెలుసా…?