దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుస చిత్రాలతో దూసుకుపోయారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా అనేక చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Advertisement
బాహుబలి సినిమా తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. రానా నాయుడు వెబ్ సిరీస్ తో మళ్లీ హిట్ అందుకున్నాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత రానా అనారోగ్యంతో బాధపడ్డాడని సమాచారం. ఆ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా…యాంకర్ మాట్లాడుతూ… మీ ఆరోగ్యం బాగాలేదని, కిడ్నీలో మార్పులు జరిగాయని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా అడగ్గా… దానికి సమాధానంగా రానా బాహుబలి సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించి ఉంటే ఇప్పటికీ నా రేంజ్ ఎవ్వరు ఊహించని స్థాయిలో ఉండేది.
Advertisement
అది పూర్తిగా నా దురదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. నా జీవితంలో నేను చాలా దరిద్రమైన రోజులను చూశాను. ఆరోగ్యపరంగా నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు చాలా బాగున్నాను. ఆ రోజుల్లో ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని ఎలా ఎదుర్కోవాలో నేను నేర్చుకున్నాను. నా కుటుంబం నాకు చాలా సహకరించింది. ప్రస్తుతానికి అయితే నేను చాలా బాగున్నాను. పలు చిత్రాల్లో కూడా నటిస్తున్నాను అని రానా చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
Shikhar Dhawan : ICC టోర్నమెంట్లలో శిఖర్ ధావనే మొనగాడు..కోహ్లీ, రోహిత్ పనికిరారు ?
Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్
Shubman Gill : SRH కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ?