నటసింహం నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు పోస్టర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వీరసింహారెడ్డి సినిమాకు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా పనిచేశారు. కాగా తాజా ఇంటర్వ్యూలో వాళ్లు మాట్లాడుతూ….వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డి రెండు డిఫరెంట్ సినిమాలు రెండు సినిమాలకు పనిచేశాం.
ఆ రెండు సినిమాలు డిఫరెంట్ ఇద్దరు హీరోల బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉండటం వల్ల డిఫరెంట్ గా ఫైట్ లు కంపోజో చేశాం. వీరసింహారెడ్డి సినిమాలో ఇంటర్వెల్ సీన్ బ్యాంగ్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే కంటతడి పెట్టాల్సిందే. ఆ సీన్ చూస్తూ స్పాట్ లోనే మేము కూడా కన్నీళ్లు పెట్టుకున్నాం అంటూ చెప్పారు.
అంతే కాకుండా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి రవితేజ మధ్య ఓ ఎమోషనల్ సీన్ ఉంటుంది. అది కూడా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. అంటూ రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమాల భారీ అంచనాలు ఉండగా రామ్ లక్ష్మణ్ వాటిని మరింత పెంచారు. మరి ఈ సినిమాల్లో ఏది సంక్రాంతి హిట్ గా నిలుస్తుందో చూడాలి.