మెగాతయనుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ పెరిగిపోయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ల నటనను విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కు రీసెంట్ గా గుడ్ మార్నింగ్ అమెరికా అనే పాపులర్ టీవీ షో నుండి ఆహ్వానం అందింది.
Advertisement
దాంతో చరణ్ అమెరికాకు పయనం అయ్యి అక్కడ షో లో పాల్గొన్నాడు. ఇక రామ్ చరణ్ అమెరికాలో అడుగుపెట్టడంతో ఆయనను కలిసేందుకు చాలా మంది తెలుగువారు, అభిమానులను చరణ్ ను కలిసేందుకు వెళ్లారు. చరణ్ వారితో కలిసి దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే చరణ్ అమెరికాకు వెళుతున్న సమయంలో అయ్యప్ప మాలలో వెళ్లాడు. మాల ధరించడంతో నల్లని దుస్తుల్లో వెళ్లాడు.
Advertisement
కానీ అక్కడకు వెళ్లిన తరవాత చరణ్ సూటు బూటు వేసుకుని దర్శణం ఇచ్చారు. దాంతో కొంతమంది నెటిజన్ లు అయ్యప్పమాల ధరించిన వ్యక్తి ఎలా ఇతర దుస్తులను వేసుకుంటారు. మధ్యలో మాల ఎలా తీశాడు అంటూ సందేహం వ్యక్తం చేశారు. కాగా రామ్ చరణ్ టీమ్ దీనిపై స్పందించింది. రామ్ చరణ్ 21 రోజుల దీక్ష వేశారట.
అంతే కాకుండా 21 రోజులు పూర్తవ్వడంతో న్యూయార్క్ లోని ఓ ఆలయంలో చరణ్ మాలను విరమించుకున్నారట. ఇక కొంతమంది 41 రోజులు అయ్యప్పమాల వేస్తారు కదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చరణ్ ఏడాదికి రెండు మూడు సార్లు మాల వేస్తారట. కాబట్టి ఆయన 21 రోజుల మాల ధరిస్తారని సమాచారం.
ALSO READ :ఆస్పత్రి బెడ్ పైనే వధువుకు తాళి కట్టిన వరుడు..వీడియో వైరల్