సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ లు ఈమధ్య హద్దులు దాటుతున్నాయి. అభిమానులు హీరోల కోసం తమలో తాము దూషించుకోవడంతో పాటు సినిమా దర్శకులను రచయితలను సైతం తిడుతున్నారు. తాజాగా పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి విషయంలోనూ అదే జరిగింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
Advertisement
అంతేకాకుండా తమ ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి జై బాలయ్య అనే లిరికల్ పాటను విడుదల చేశారు. కాగా ఈ పాటకు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించారు. ఈ పాటలోని లిరిక్స్ లో…. రాజసం మీ ఇంటి పేరు… పౌరుషం నీ ఒంటి పేరు …రాయలోరి తేజం. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా. ఆ మొలతాడు కట్టిన మొగుడు ఇంకా పుట్టలేదేనయ్యా…. అంటూ ఉంది. ఈ పాట లిరిక్స్ ను దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు.
Advertisement
అంతేకాకుండా పాట లిరిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ లిరిక్స్ మెగా హీరోలను ఉద్దేశించి ఉందంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరోవైపు బాలయ్య అభిమానులు పాటను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరో ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ మొదలయ్యింది. ఈ క్రమంలో కొంతమంది లిరిక్స్ రాసిన రామ జోగయ్య శాస్త్రి పై సైతం మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో రామజోగయ్యశాస్త్రి హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.
దాంతో ఆయన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయగా అది నెట్టెంట వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో రామజోగయ్య శాస్త్రి…. ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వాళ్ళు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టు నాకు జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ శాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికి ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు…. ఉంటే ఇటు రాకండి. అంటూ దండం పెట్టే ఎమోజీలను రామజోగయ శాస్త్రి షేర్ చేశారు.