Home » “రామబాణం” మూవీకి ఏకంగా అన్ని కోట్ల నష్టం… ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

“రామబాణం” మూవీకి ఏకంగా అన్ని కోట్ల నష్టం… ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోలలో ఒకరిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి శ్రీ వాసు దర్శకత్వం వహించగా … డింపుల్ హయాతి మూవీలో హీరోయిన్గా నటించింది.

Advertisement

జగపతిబాబు, కుష్బూ ఈ మూవీలో కీలకపాత్రలలో నటించగా… మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. గోపీచంద్… శ్రీ వాసు కాంబినేషన్లో ఇదివరకే లక్ష్యం, లౌక్యం అనే రెండు మూవీలు రూపొంది మంచి విజయాలను అందుకోవడంతో రామబాణం సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ మే 5 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

Advertisement

దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 15.1 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ ముగిసే సరికి నైజాంలో 1.25 కోట్లు , సీడెడ్ 0.55 కోట్లు , ఉత్తరాంధ్రలో 0.48 కోట్లు , ఈస్ట్ లో 0.36 కోట్లు , వెస్ట్ లో 0.22 కోట్లు , గుంటూరు లో 0.28 కోట్లు , కృష్ణ లో 0.30 కోట్లు , నెల్లూరులో 0.17 కోట్లు , ఏపీ మరియు తెలంగాణలో 3.61 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.15 కోట్లు , ఓవర్సీస్ లో 0.13 కోట్లు , వరల్డ్ వైడ్ గా 3.89 కోట్ల కనెక్షన్లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీకి 11.61 కోట్ల నష్టాలు వచ్చాయి.

Visitors Are Also Reading