రామ్ కీ బండీ హైదరాబాద్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. రామ్ కీ బండీ దోశ అంటే ఎవరికైనా నోరూరాల్సిందే. అయితే సాధారణ టిఫిన్ బండిగా మొదలైన రామ్ కీ బండీ ఓ బ్రాండ్ గా మారడం వెనక ఓ పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నాటక నుండి వచ్చిన ఓ వ్యక్తి దోశ బండి పెట్టుకున్నాడు. అతడి దోశకు క్రేజ్ రావడంతో బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు. అయితే అతని కొడుకు ఎంబీజే పూర్తి చేసి ఉద్యోగం చేయాలనుకున్నాడు. అతడే రామ్ కుమార్….ఆయన పేరుమీదనే రామ్ కీ బండీని ఏర్పాటు చేశారు.
అయితే ఎంజీఏ చేసిన రామ్ కుమార్ ఉద్యోగం కోసం వెళితే 10వేల జీతానికి పనిచేయాలన్నారు. దాంతో తన తండ్రి టిఫిన్ సెంటర్ లో వంట మాస్టర్ లు తన జీతం కంటే ఎక్కువ సంపాదిస్తారని గుర్తుకు వచ్చి మరోసారి ఉద్యోగం చేయాలన్న ఆలోచనే చేయలేదు. నాన్న సక్సెస్ ఫుల్ గా నడుపుతున్న దోశ బండిని మరింత ఫేమస్ చేయాలనుకున్నాడు. వినూత్న ఆలోచనలతో నగరంలో పలు చోట్ల రామ్ కీ బండీలను ఏర్పాటు చేయించాడు. 6 సెంటర్లలో రామ్ కీ బండీలు ఏర్పాటు చేశాడు.
Advertisement
Advertisement
నగర వ్యాప్తంగా రోజుకు 5వేల వరకూ దోశలు అమ్ముతున్నారు. దోశల్లో డిఫరెంట్ దోశలు వేయడం. అంతే కాకుండా దోశ క్వాలిటీని సైతం పెంచారు. పిజ్జా దోశను మొదటిసారిగా తామే చేశామని రామ్ కుమార్ చెబుతున్నారు. తమ వద్ద దోశలు తినే ప్లేట్ ను కూడా ఎంతో ఖర్చుతో చేయిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగాలు చేసే కంటే యువత మొదట బిజినెస్ లోకి అడుగుపెట్టాలని రామ్ కుమార్ సూచించారు. ఇతర రాష్ట్రాలు, నగరాల్లో కూడా తన రామ్ కీ బండి లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతే కాదు దుబాయ్ లో సైతం ఏర్పాటు చేయాలని ప్లాన్ ఉన్నట్టు వెల్లడించారు.
Also Read: తుఫాన్ ఎఫెక్ట్…450 మందికి తేలు కాటు..ముగ్గురు మృతి..!