రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరు వివాహమైన 11 సంవత్సరాల వరకు పిల్లలను కనలేదు. వీరిపై అనేకమంది ట్రోలింగ్ చేసేవారు. వాటికి ఉపాసన తనదైన స్టైల్ లో స్పందించేవారు. ఇక వీరు పెళ్లైన 12 సంవత్సరాలకి తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 20న ఉదయం 1:49 గంటలకు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే వారి కూతురు జాతకం చాలా బాగుందని, తన జాతకంలో రాజయోగం కనిపిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం జరిగింది.
Advertisement
అంతేకాకుండా చిరంజీవి కూడా నా మనవరాలు జాతకం చాలా బాగుంది అని మీడియాతో చెప్పారు. అంతేకాకుండా తన మనవరాలు పుట్టిన గంటల వ్యవధిలోని చిరంజీవికి 30 కోట్ల లాభం తెచ్చిపెట్టిందట. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి స్థలంపై అప్పట్లో తెలంగాణ హైకోర్టులో ఉత్తర్వులు జారీ చేసింది. వివాదంలో ఉన్న ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పడం జరిగింది. దీంతో చిరంజీవి ఆ స్థలాన్ని కోల్పోయానని చాలా బాధపడ్డాడు.
Advertisement
అయితే తాజాగా ఈ స్థలంపై హైకోర్ట్ చిరంజీవికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుమారుగా 595 గజాల స్థలం ఇది. ప్రస్తుతం ఈ స్థలం ఖరీదు అక్షరాల 30 కోట్లు. ఇక చిరంజీవి ఇన్ని రోజులుగా పోయింది అనుకున్నా ఈ స్థలం మెగా మనవరాలు రాకతో తనకు వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెగా వారసురాలి రాకతో కుటుంబ సభ్యులు ఆనందంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
Samajavaragamana Review : ”సామజవరగమన” మూవీ రివ్యూ
Spy Movie Review : ‘స్పై’ మూవీ రివ్యూ..నిఖిల్ ఖాతాలో మరో హిట్ ?
Chiranjeevi: పెద్ద కూతురు సుష్మితకు చిరంజీవి ఎందుకంత అన్యాయం చేస్తున్నాడు?