మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 20వ తారీకు ఉదయం తెల్లవారుజామున 1:00 కి ఆడపిల్ల పుట్టింది. 11 సంవత్సరాలు వైవాహిక వార్షికోత్సవాన్ని జరుపుకుని ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఉపాసన, చరణ్. ఈ బిడ్డ జన్మించడం తో చెప్పలేనంత ఆనందం కుటుంబంలో అలుముకుంది. చిరంజీవి కూడా వీళ్ళ గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా ఆయన మనసు లోని విషయాలని బయటకి చెప్పుకున్నారు.
Advertisement
ఆడపిల్ల పుట్టడం మాకు ఎంతో అదృష్టమని ఇది మాకు ఎంతో అపురూపమని అన్నారు చిరు. 11 ఏళ్ల నుండి రామ్ చరణ్ ఉపాసనలు ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారని చూశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు ఎదురు చూపులకి ఇప్పుడు తెర పడిందని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అయితే రామ్ చరణ్ కూతురు పుట్టిన టైం తేదీని బట్టి న్యూమరాలజీ ప్రకారం జీవితం ఎలా ఉండబోతుందా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Advertisement
అయితే మరి న్యూమరాలజిస్ట్లు ఏం చెప్తున్నారనేది చూస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురి కి రెండవ నెంబర్ బాగా కలిసి వస్తుంది. చిరంజీవి పుట్టింది ఆగస్టు 22 అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సెప్టెంబర్ 2న పుట్టారు. ఈమె కి కూడా రెండు అంకె బాగా కలిసి వస్తుందని చాలా రేర్ కాంబినేషన్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక ఈమె జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి తిరుగు లేదని తెలుస్తోంది. బాగా పైకి వస్తుంది. కుటుంబమంతా గర్వ పడేలా ఈమె ఎదుగుతుందని న్యూమరాలజిస్టులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉపాసన హాస్పిటల్ లో పాప తో పాటుగా ఉంది మరి ఈరోజు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
Also read:
రామ్ చరణ్ కూతురి ఫోటోలు లీక్.. ఎవరి పోలికలు అంటే..?
కష్టాలు, బాధల నుండి గట్టెక్కాలంటే.. శనివారం నాడు ఈ 5 దానం చేయండి..!