Home » సూపర్‌ స్టార్‌ బిరుదుపై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..! ఇంతకీ ఏమన్నారంటే..?

సూపర్‌ స్టార్‌ బిరుదుపై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..! ఇంతకీ ఏమన్నారంటే..?

by Mounika
Ad

రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమను ఏలుతున్న హీరోలలో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ నటించిన చిత్రాలు కేవలం తమిళ్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఆయన నటించిన చిత్రాలకు తెలుగులో సైతం సినీ అభిమానులు బ్రహ్మరథం పడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం రజనీకాంత్ ను సక్సెస్ గా దిశగా నడిపించింది. ఆయన నటించే చిత్రాలు ఇప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడతాయి. ఆయన విలక్షణ నటన, స్టైల్‌, డైలాగ్‌ డెలివరిని సినీ అభిమానులు బాగా ఇష్టపడతారు. అందుకే రజనీకాంత్ ని ఆయన అభిమానులు ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు.

Advertisement

రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీవీలో బాలీవుడ్‌ స్టార్‌ జాకీష్రాఫ్‌, కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, తమన్నా, సునీల్‌, రమ్యకృష్ణ, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఆగస్టు 10వ తేదీన ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో విడుదల ఫంక్షన్‌ ఇంటర్వ్యూలో రజిని మాట్లాడుతూ సూపర్ స్టార్ బిరుదుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జైలర్‌ మూవీలో ‘హుకుమ్‌..’ పాటలో సూపర్‌ స్టార్‌ అనే పదం వచ్చింది. ఆ పదాన్ని తొలగించాలని రజనీకాంత్ డైరెక్టర్ కి తెలియజేశారు.

Advertisement

నిజానికి చెప్పాలంటే సూపర్‌ స్టార్‌ అనే బిరుదు నాకు ఎప్పుడూ సమస్యగానే ఉంది. సూపర్ స్టార్ బిరుదు పై 1977లోనే పెద్ద వివాదం చెలరేగింది. అప్పట్లో నటుడు శివాజీ గణేషన్‌, కమలహాసన్‌ వంటి వారు కూడా ప్రముఖ నటులుగా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ సూపర్‌ స్టార్‌ బిరుదు నాకు ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసిందని రజనీకాంత్ తెలియజేశారు.

ఇందుకోసం మీకో చిన్న కథ చెప్పాలి. అడవిలో ఓ గద్ద, ఓ కాకి ఉన్నాయి. అయితే కాకి గద్దకంటే పైకి ఎగరడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. కానీ కాకి ఎప్పటికీ గద్దను మించి ఎగరలేదు. ఇది వాస్తవం. నేను నా జీవితంలో ఇద్దరికే భయపడతాను. అందులో ఒకరు భగవంతుడు, రెండోది మంచి మనుషులకే’ అని రజినీకాంత్ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

తమిళ ఇండస్ట్రీపై తప్పుడు ప్రచారం.. పవన్ వ్యాఖ్యలపై నాజర్ సీరియస్‌ !

ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా ?

పవన్ కళ్యాణ్ ‘BRO’ మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading