సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు క్రేజ్ ఉంది. తమిళనాడు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి హీరోగా ఎదిగాడు రజినీకాంత్. ఇక ఇటీవల జైలర్ సినిమాతో ప్రభంజనమే సృష్టించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. 400 కోట్లతో తీసిన జైలర్ సినిమా… 1000 కోట్ల కలెక్షన్ వైపు దూసుకుపోతోంది.
ఈ సినిమాలో నటించినందుకుగాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చింది చిత్ర బృందం. ఇది ఇలా ఉండగా… సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తెలంగాణ గవర్నర్ గా రాబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ బిజెపి పార్టీకి చాలా దగ్గరగా ఉంటారన్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
ఇటు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళసై మరియు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మద్య వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో బిజెపిని బలోపేతం చేసేందుకు రజనీకాంత్ ను రంగంలో దించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ ను తెలంగాణ గవర్నర్గా పంపాలని ఆలోచన చేస్తోందట బిజెపి. దీని పై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు కూడా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Yadamma Raju : రెండో పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..!
Mahesh Vitta Marriage : ప్రియురాలితో ఏడడుగులు వేసిన మహేష్విట్టా
Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. ?