Home » రజినీకాంత్ ను ఆయన భార్య ఏం చూసి ఇష్టపడ్డారో తెలుసా…? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ..!

రజినీకాంత్ ను ఆయన భార్య ఏం చూసి ఇష్టపడ్డారో తెలుసా…? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ..!

by AJAY
Ad

సాధారణ బస్ కండక్టర్ తన స్టైల్ తో మ్యానరిమ్ తో సినిమా వాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత సినిమా ఆఫర్ లు అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.ఆయన మరవరో కాదు…. తమిళ స్టార్ హీరో రజనీకాంత్. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ రజినీకాంత్ తెలుగుతోపాటు తమిళ మలయాళ హిందీ భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.

latha mangeshkar

latha mangeshkar

 

బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇది ఇలా ఉంటే రజిని జీవితంలో అంతలా సక్సెస్ అవ్వడానికి ఆయన భార్య కూడా ఒక కారణమని అనేక సందర్భాల్లో చెప్పారు. రజినీకాంత్ భార్య పేరు లత…. కాగా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రజనీకాంత్ సహనటుడు వై.జి మహేంద్రన్ ఆయనకు ప్రాణమిత్రుడు కూడా.

Advertisement

rajinikanth

Advertisement

రజనీకాంత్ కేవలం వై.జి. మహేంద్ర తోనే ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. తరచూ ఆయన ఇంటికి వెళ్లి కలుస్తుండేవారు. ఆయన సోదరి లత రజనీకాంత్ ముక్కుసూటితత్వం… నిజాయితీ చూసి ఇష్టపడ్డారట. అన్యాయాన్ని రజినీకాంత్ అసలు భరించేవారు కాదట…. దాంతో ఆయనకు యాంగ్రీ యంగ్ మాన్ అనే బిరుదు కూడా వచ్చింది.

ఇక ఆ క్వాలిటీలు నచ్చి లత రజినికాంత్ ను ఇష్టపడడంతో పాటు ఆయన కూడా ఆమె ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుని కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత లత వల్ల రజనీకాంత్ లో చాలా మార్పులు కూడా వచ్చాయట. ఆయన కోపం పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా రజినీకాంత్ ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసింది కూడా ఆయన భార్య వల్లే అని సన్నిహితులు చెబుతుంటారు.

Also read : లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ ముద్దుగా ఏమని పిలిచేవారో తెలుసా…? కోపంలో ఏమనే వారంటే..?

Visitors Are Also Reading