సాధారణంగా టాలీవుడ్ హీరోలు తమకు తామే డబ్బింగ్ చెప్పుకుంటారు. వాయిస్ చక్కగా లేనివారు, వరుస సినిమాలతో బిజీగా ఉన్నవారు డబ్బింగ్ ఆర్టిస్ట్ లతో డబ్బింగ్ చెప్పించుకుంటారు. హీరో రాజశేఖర్ వాయిస్ పవర్ ఫుల్ గా లేని కారణంగా ఆయన ప్రతి సినిమాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవారు. ఇదిలా ఉంటే అన్నగారు ఎన్టీఆర్ నటుడు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారన్న విషయం చాలా మందికి తెలియదు.
Advertisement
రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ లో ఒక్కప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు. ఆ తరవాత నటుడుగా ఎంట్రీ ఇచ్చి కూడా రాజేంద్రప్రసాద్ అభిమానులను సంపాదించుకున్నారు. ఒకే రకమైన పాత్రలకు ఫిక్స్ కాకుండా అన్ని రకాల పాత్రల్లో నటించి విలక్షణ నటుడుగా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్నారు.
Advertisement
రాజేంద్రప్రసాద్ కూడా ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు నుండే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్వగ్రామం దొండపాడు కాగా ఆయన ఇంటికి రాజేంద్రప్రసాద్ తరచూ వెళ్లి వచ్చేవారట. ఆయన ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కూడా సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా మాజీ ప్రధాని పీవీ మెచ్చిన నటుడుగా రాజేంద్రప్రసాద్ ఎదిగారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారన్న విషయం చాలా మందికి తెలియదు.
అయితే ఎన్టీఆర్ పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పింది ఆయన సినిమాలో మాత్రం కాదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ అయిన మహానటి సినిమాలో….ఎన్టీఆర్ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈ పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ కు ఉండే రెండు డైలాగులను కూడా ఆయనే చెప్పారు. ఇక మహానటి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.