Home » ‘రాజీవ్ గాంధీ’ ఢిల్లీ కి ‘కృష్ణ’ గారిని పిలిచించి ‘ఎన్టీఆర్’ గురించి ఏమని చెప్పారో తెలుసా ?

‘రాజీవ్ గాంధీ’ ఢిల్లీ కి ‘కృష్ణ’ గారిని పిలిచించి ‘ఎన్టీఆర్’ గురించి ఏమని చెప్పారో తెలుసా ?

by AJAY
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ నేడు ఉద‌యం నాలుగు గంట‌ల‌కు క‌న్నుమూశారు. టాలీవుడ్ సినీప్ర‌స్థానంలో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్న‌సంగ‌తి తెలిసిందే. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌తో స్టార్ హీరోగా ఎద‌గ‌టంతో పాటూ రాజ‌కీయాల్లోనూ రానించారు. అయితే పొలిటిక‌ల్ గా కృష్ణ సీనియ‌ర్ ఎన్టీఆర్ ను చాలా విభేదించేవారు. ఇద్ద‌రి మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ కొన‌సాగింది. కాగా ఆయ‌న ఇప్పుడు దూరం అవ్వ‌డంగా ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ తో నెల‌కొన్న విభేదాల గురించి చెప్పారు. మొద‌ట నాదెండ్ల భాస్క‌ర‌రావు సీఎం అయ్యాక దానికి సంబంధించి ఓ పేప‌ర్ ప్ర‌క‌ట‌న‌లో త‌న ఫోటో వేశార‌ని చెప్పారు. త‌న‌కు చెప్ప‌కుండా త‌న ఫోటోను ఆ ప్ర‌క‌ట‌న‌లో వేశార‌ని అన్నారు. ఆ త‌ర‌వాత ఏపీలో తెలుగుదేశం వాళ్లు త‌న‌పై సీరియ‌స్ అయ్యార‌ని త‌న పోస్ట‌ర్ చింపేశార‌ని చెప్పారు. ఆ విష‌యం కూడా తన‌కు త‌ర‌వాత తెలిసింద‌ని అన్నారు.

Advertisement

ఓ రోజు మ‌ద్రాస్ లో ఎన్టీఆర్ ను క‌లిసి జ‌రిగిన విష‌యం చెప్పానని అన్నారు. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ సీఎం అయ్యాక జ‌రిగింది మ‌న‌సులో పెట్టుకుని త‌న‌పై క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు. ఇందిరా గాంధీ చ‌నిపోయిన త‌ర‌వాత తాను ఢిల్లీకి వెళ్లిచూసివచ్చాన‌ని అప్పుడే త‌న‌కు రాజ‌కీయనాయ‌కుల త‌ర‌వాత ప‌రిచయాలు ఏర్ప‌డ్డాయ‌ని అన్నారు.

అది జ‌రిగిన త‌ర‌వాత త‌న‌కు రాజీవ్ గాంధీ నుండి ఆహ్వానం అంద‌డంతో ఢిల్లీ వెళ్లాన‌ని చెప్పారు. త‌న‌తో రాజీవ్ గాంధీ ఏపీలో తెలుగుదేశంలో ఎన్టీఆర్ మాస్ లీడర్ షిప్ తెలుగుదేశంకు ఉంది. మాకు అలాంటి లీడ‌ర్ కావాలి మీరు కాంగ్రెస్ లో చేరండ‌ని అడిగార‌ని చెప్పారని తెలిపారు. ఆయ‌న అడిగిన విధానం న‌చ్చి తాను ప్రచారం చేశాన‌ని చెప్పారు. అందువ‌ల్లే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాన‌ని అన్నారు.

Visitors Are Also Reading