జ్యోతిషశాస్త్రంలో రాశి చక్రాలలో మార్పులు, గ్రహాల కలయిక తో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఒక గ్రహం సంచరించినప్పుడు అది అన్నిరకాల రాజయోగాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు జూన్ 18 న వృషభ రాశి లోకి ప్రవేశించాడు. జ్ఞాన మూలమైన బుద్ధుడు ఇప్పటికే వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి లో బుధ శుక్రుల కలయిక ఏర్పడుతుంది. ఇక 30 సంవత్సరాల తర్వాత శని తన అసలు రాశి లో కూర్చుంటాడు. ఈ గ్రహాల కలయిక వల్ల రాజ యోగం ఏర్పడుతుంది. మరి ఆ రాశుల వారు ఎవరో చూద్దాం..
Advertisement
వృషభ రాశి:
వీరి రాశి లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లు కూడా వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఆఫర్ కూడా లభిస్తుంది.
సింహరాశి :
బుధుడు శుక్రుడు కలయిక వల్ల ఈ రాశిలో శశ మాలవ్య అనే రెండు రాజయోగాలు ఉద్భవించాయి. వీటి ప్రభావం వల్ల ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. విదేశీ వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.
Advertisement
వృశ్చిక రాశి :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశిలో మహాపురుషుల రాజయోగం ఏర్పడుతుంది. శశ రాజయోగ ప్రభావంతో ప్రమోషన్స్ లేదా కొత్త ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం ఉన్నవారికి అభివృద్ధి చెందుతుంది.
మకర రాశి :
ఉద్యోగం చేస్తున్న స్థలంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఆర్ధిక పరిస్థితి బలంగా తయారవుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం కూడా కలుగుతుంది.
కుంభ రాశి:
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశి వారి జాతకం లో శశ మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వస్తు వనరులు పెరుగుతాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది.
ALSO READ:
- Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి
- అల్లుఅర్జున్ మరో రికార్డు.. పుష్పతో ఫస్ట్ ఇండియన్ హీరోగా ఘనత