Home » అల్లుఅర్జున్ మ‌రో రికార్డు.. పుష్ప‌తో ఫ‌స్ట్ ఇండియ‌న్ హీరోగా ఘ‌న‌త

అల్లుఅర్జున్ మ‌రో రికార్డు.. పుష్ప‌తో ఫ‌స్ట్ ఇండియ‌న్ హీరోగా ఘ‌న‌త

by Anji

అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన సినిమా పుష్ప గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. డిసెంబ‌ర్ 17, 2021లో విడుద‌లైన ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిన విష‌య‌మే. అయితే పుష్ప మ‌రో అరుదైన రికార్డ్ సృష్టించింది. తాజాగా పుష్ప మ్యూజిక్ ఆల్బ‌మ్ ఏకంగా 5 బిలియ‌న్ వ్యూస్ సాధించింది. అన‌గా అక్ష‌రాలా 500 కోట్ల వ్యూస్ అన్న‌మాట‌. ఇండియ‌న్ సినిమాలో ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కావ‌డం విశేషం. ఇక సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన పుష్ప ఆల్బ‌మ్ అన్ని చోట్లా అద్భుతాల‌నే సృష్టించింది.

pushpa

దాక్కో దాక్కో మేక‌, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఉఊ అంటావా పాట‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వ‌చ్చేసింది. సోష‌ల్ మీడియా రీల్స్‌లో శ్రీ‌వ‌ల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెబుకున్నా త‌క్కువే. ఇలా ప్ర‌తీ పాట‌ను ఆడియ‌న్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఇండియాలో మ‌రే సినిమాకు సాధ్యం కానీ రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది పుష్ప మ్యూజిక్‌. ఇంత‌కు అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురంలో సినిమా కూడా మ్యూజిక‌ల్‌గా సంచ‌ల‌నాలే సృష్టించ‌డం విశేషం. పుష్ప కూడా అదే కంటిన్యూ చేసి రికార్డు సృష్టించింది.

ఇక పుష్ప త‌న‌కు మైల్ స్టోన్ మూవీ అవుతుంద‌ని ప్రారంభం నుంచే చెబుతూనే వ‌చ్చారు అల్లు అర్జున్. ఆయ‌న చెప్పిన ప్ర‌తి అంచ‌నా నిజ‌మైపోతుంది ఇప్పుడు. ఈ మ‌ధ్య బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణి పంపిన మెసేజ్ తెగ వైర‌లైంది. పుష్ప సినిమాలో ప్ర‌తీ సీన్ చాలా అద్భుతంగా ఉన్న‌ద‌ని.. అలాంటి సినిమా అస‌లు ఎలా తీశారో కూడా అంతు చిక్క‌డం లేదంటూ సుకుమార్‌ను పొగిడారు. ఈ చిత్రానికి తొలిరోజు డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఫ‌లితంపై పూర్తి న‌మ్మ‌కంతోనే ఉన్నారు బ‌న్నీ. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే పుష్ప సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి.. రూ.350 కోట్లు వ‌సూలు చేసి అల్లుఅర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పలువురు సెల‌బ్రెటీలు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్స్ సైతం పుష్ప డైలాగ్‌లను వాడుతున్నారు. రాజ‌కీయ నాయ‌కులు, క్రీడాకారులు సైతం పుష్ప మేన‌రిజ‌మ్స్ వాడ‌డం విశేషం.

Also Read : 

సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొన‌సాగుతున్న ఆచార్య‌..!

న‌రేష్ ప‌విత్ర లోకేష్ హోట‌ల్‌లో క‌ల‌వ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

 

Visitors Are Also Reading