Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » క‌త్రినా కైఫ్ బుగ్గ‌ల్లాంటి రోడ్లు కావాలి : మంత్రి

క‌త్రినా కైఫ్ బుగ్గ‌ల్లాంటి రోడ్లు కావాలి : మంత్రి

by Azhar
Ads

రాజ‌స్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇటీవ‌లే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న రాజేంద్ర …మంత్రి అయిన కొన్ని రోజుల‌కే వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న నియోజ‌క వ‌ర్గ‌మైన ఉద‌య పూర్వ‌తి ప్ర‌జ‌ల‌తో సంభాషిస్తూ మ‌న రోడ్ల ప‌రిస్థితి బాలేదు…. త్వ‌ర‌లోనే మ‌న ఊరికి మంచి రోడ్లు వ‌స్తాయంటూనే మీటింగ్‌లో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్ వైపు తిరిగి, “నా నియోజకవర్గంలో కత్రినా కైఫ్ బుగ్గ‌ల మాదిరిగా నున్న‌ని రోడ్లు వేయాలి” అని సరదాగా అన్నారు.

Advertisement

Ad

మొదట్లో హేమమాలిని చెంపల మాదిరిగా అన్న రాజేంద్ర‌….. త‌ర్వాత ఈ రోజుల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న న‌టి ఎవ‌ర‌ని అడిగి మ‌రీ క‌త్రినా పేరును ప్ర‌స్తావిస్తూ ఆమె బుగ్గ‌ల్లాంటి రోడ్లు కావాల‌న్నారు. ఈ స్పీచ్ సోష‌ల్ మీడియాలో ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి. మ‌రి సార్ గారి మంత్రి ప‌ద‌వి ఉంటుందా? ఊడుతుందా చూడాలి!

Watch Video :

Advertisement

Visitors Are Also Reading