ఇండియాలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లలో రాజమౌళి కూడా ఒకరు. రచయిత విజయేంద్రప్రసాద్ కుమారుడిగా రాజమౌళి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. మరోవైపు రాజమౌళి చేసిన సినిమాలన్నింటికీ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథలను రాయడం గొప్పవిషయం. రాజమౌళి ప్రముక దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద శిష్యరికం చేశారు. ఆ తరవాత శాంతినివాసం అనే సీరియన్ ను తెరకెక్కించారు.
Advertisement
ఈ సీరియల్ ఎంతో సక్సెస్ అయ్యింది. ఈ సీరియల్ తరవాత ఏకంగా ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ 1 సినిమా తీసే అవకాశం వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తరవాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరవాత రాజమౌళి కెరీర్ లో తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ లు అందుకున్నాడు.
Advertisement
రామ్ చరణ్ తో చేసిన మగధీర సినిమాతో రాజమౌళి పేరు ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి నెక్స్ట్ లెవల్ కు వెళ్లిపోయాడు. రీసెంట్ గా జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా డిజైనర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.
అంతే కాకుండా రాజమౌళి కుమారడు కార్తికేయ కూడా జక్కన్న సినిమాలకు పనిచేస్తుంటారు. ఇదిలా ఉంటే రాజమౌళికి ఫుల్ క్రేజ్ ఉండటంతో ఆయన తన సినిమాలకు భారీ రెమ్యునరేషన్ ను పుచ్చుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకూ రాజమౌళికి రూ.148 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
ALSO READ : నటి పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరంటే ? ఆయనతో ఉన్న వివాదం అదేనా ?