దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఓ లెవెల్ లో బజ్ ఉంటుంది. రెండు మూడేళ్ళ ముందు నుంచే గాసిప్స్ మొదలైతే.. షూటింగ్ కి రెండేళ్ల టైం, ఇంకా టెక్నికల్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కలుపుకుని మరో ఏడాది చేసినా చేస్తారు. అయితే.. ఎంత లేట్ అయినా జక్కన్న ఎంట్రీ మాత్రం లేటెస్ట్ గా ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ హిట్ అయిన తరువాత జక్కన పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగారు. అయితే.. రాజమౌళి తన కెరీర్ ప్రారంభంలో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దర్శకధీరుడిగా నిలబడ్డారు.
Advertisement
ఆయన తన కెరీర్లో మొత్తం 12 సినిమాలే చేసారు. కానీ అన్ని సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. ప్రతి సినిమా వెనుక ఆయన ఎంతో కష్టపడి పక్కాగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఉంటుంది. ప్రతి సినిమాలోను ఆయన డెడికేషన్, ఆయన పడ్డ కష్టం కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. ఒక్క ఫ్లాప్ లేకపోయినా.. రాజమౌళి కెరీర్ లో ఒక సినిమా ఆయనను విపరీతంగా బాధపెట్టిందట. ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమా “యమదొంగ”. ఈ సినిమా వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా రాజమౌళిని చాలా బాధపెట్టిందట. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భూలోకం, యమలోకం కాన్సెప్ట్ తో రూపొందిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఈ సినిమాలో యముడిగా నటించారు. సరిగ్గా ఇదే రోజు అంటే ఆగష్టు 15 2007 లో యమదొంగ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కి అందరు ఫిదా అయ్యారు. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన రాజమౌళి ఎన్టీఆర్ యాక్టింగ్ వల్లే ఈ సినిమా హిట్ అయ్యిందని.. మేకింగ్ పరంగా ఈ సినిమాలో చాలా తప్పులు చేసానని రాజమౌళి చెప్పుకొచ్చారు. మేకింగ్ పరంగా యమదొంగ సినిమా నన్నెప్పుడు బాధ పెడుతూ ఉంటుందని, మేకింగ్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటె ఈ సినిమా ఎన్నో రికార్డు లు తిరగరాసేదని రాజమౌళి చెప్పుకొచ్చారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రాత్రిపూట మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎందుకో తెలుసా..?
అధికమాస అమావాస్య నాడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి..! శివుని ఆగ్రహానికి లోనవుతారు..!
Chanikya niti : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు మీలో కచ్చితంగా ఉండాలి..!