సాధారణంగా జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా చదువుకోవాలని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా స్కూల్ మరియు ఇంటర్ చదివే పిల్లలపై ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ లు సైంటిస్ట్ లు అవ్వాలని చిన్నప్పుడే తల్లిదండ్రులు డిసైడ్ చేస్తుంటారు. ఎప్పుడూ చదువుతూనే ఉండాలని పిల్లలపై ఒత్తిడి కూడా తీసుకువస్తారు.
Advertisement
అయితే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే చదువు అవసరం లేదని ఎంతో మంది నిరూపించారు. ఇక అందుకు ఉదాహరణగా రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళిని కూడా చెప్పొచ్చు.
Advertisement
రాజమౌళి చదివింది ఇంటర్ మాత్రమే ఆ తరవాత చదువుకు గుడ్ బై చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన దేశంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. అంతే కాకుండా సినిమాల పై ఆసక్తి ఉండి పీహెచ్ డీలు చేసిన వాళ్లు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తే చాలని అనుకుంటున్నారు.
దేశంలో ఎంతోమంది రాజమౌలి టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా రాజమౌళి ఇంటర్ చదువుపై ఓ ఇంటర్వ్యూలో ఆయన భార్య రమా రాజమౌల సెటైర్లు వేశారు. రాజమౌలి ఏం చదువుకున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించగా నాతో అయితే ఇంటర్ చదివా అని చెబుతారు. కానీ ఆయన ఇంటర్ సర్టిఫికెట్ లు గానీ టీసీలు గానీ ఇంట్లో ఎప్పుడూ కనిపించలేదు. అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.