రాజమౌళి సినిమాలో కొన్ని సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అంతా ఆ సీన్ ను ఫీల్ అవుతారు. అలాంటి సీన్ మగధీర సినిమాలో కూడా ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ విలన్ రణధీర్ గత జన్మలో పోటీపడతారు. ఇద్దరూ గుర్రాలపై ఇసుక ఉండే ప్రదేశానికి వెళతారు. ఆ సమయంలో విలన్ రణదీర్ బిల్లా రామ్ చరణ్ ను మట్టిలో కూరుకుపోయేలా చేస్తాడు.
Advertisement
అయితే ఆ సమయంలో రామ్ చరణ్ గుర్రం భాష వచ్చి రక్షిస్తుంది. దాంతో రామ్ చరణ్ భాషకు కృతజ్ఞతలు చెబుతాడు. దాని తల పట్టుకుని ఎమోషన్ అవుతాడు. ఈ సీన్ థియేటర్ లో క్లాప్స్ కొట్టించింది. అయితే ఈ సీన్ గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఓ రోజు రాజమౌళి చిరంజీవి కొదమసింహం సినిమా చూశానని చెప్పారు. సినిమాలో విలన్స్ చిరుని పీకల్లోతు ఇసుకలో పాతి పెట్టేస్తారని అన్నారు. ఆ సమయంలో ఆయన గుర్రం వచ్చి సాయం చేస్తుందని చెప్పారు. ఆ సన్నివేశం చూసిన వెంటనే తాను ఎమోషనల్ అయ్యానని రాజమౌళి అన్నారు.
Advertisement
కానీ చిరంజీవి లేచిన తర్వాత గుర్రానికి చిరంజీవికి మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదని అన్నారు. దాంతో అది చూసి చాలా నిరాశ చెందినట్టు చెప్పారు. తనకు సాయం చేసిన గుర్రం ఓ వ్యక్తిలా కనిపించిందని… మనకు సాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పకపోతే ఆ ఎమోషనల్ ప్రేక్షకుడి గుండెను తాకదని చెప్పారు. అది మైండ్ లో ఉండిపోవడంతో ఒక సగటు ప్రేక్షకుడిగా సంతృప్తి ఇవ్వలేదని అన్నారు. దాని నుండే మగధీర లోని సన్నివేశం వచ్చింది అని చెప్పారు. కొదమ సింహం సినిమాలో తాను ఏది ఫీల్ అవ్వలేదో సగటు ప్రేక్షకుడిగా మగధీర సినిమాతో దానిని పూర్తి చేశానని చెప్పారు. ఇక జక్కన్న అనుకున్నట్టుగానే గుర్రం సీన్ ప్రేక్షకుల హృదయాలను తట్టిలేపింది.
Also read :మీరు ఎప్పుడూ చూడని నిర్మలమ్మ రేర్ ఫోటోలు…యవ్వనంలో ఆమె ముందు హీరోయిన్స్ కూడా వేస్ట్..!