Rajamouli : ఎస్.ఎస్.రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజమౌళితో సినిమా చేసేందుకు ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకేక్కించినటువంటి మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఎంతటి సంచలన విజయాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Advertisement
ప్రధానంగా భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రధానంగా గ్రాఫిక్స్ తో తెరకేక్కే సినిమాలకు దర్శకుడు రాజమౌళి కేరాఫ్ అడ్రస్ అయ్యారని చెప్పాలి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో నటించని స్టార్ హీరోలు అతి కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి మాత్రం రాజమౌళి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత.
Advertisement
ఆ సినిమా సమయంలో సినిమా లెక్కల గురించి బయటకు చెప్పకూడదని, అలాగే మగధీర సినిమాని తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని అల్లు అరవింద్ కి కండిషన్ పెట్టాడు. కానీ అల్లు అరవింద్ మాత్రం రాజమౌళి మాటను పెడచెవిన పెట్టాడు. దీంతో అప్పటి నుండి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందట. అందువల్ల రాజమౌళి అల్లు అర్జు న్ తో సినిమా చేయడం లేదని సమాచారం. అంతే కాదు ఆ హీరోతో ఈ జన్మలో సినిమా చేయను అని రాజమౌళి తెగేసి చెప్పారట.