ప్రస్తుతం రాజమౌళి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చకున్నారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడంతో ఇతర దేశాలకు చెందిన ప్రేక్షకులు కూడా సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు సైతం నామినేట్ అయ్యింది. ఇక రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు అన్న సంగతి తెలిసిందే.
Advertisement
నిజానికి రాజమౌళి తన కెరీర్ ను సీరియల్ డైరెక్టర్ గా ప్రారంభించి సక్సెస్ ఫుల్ సినిమా డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి కెరీర్ లో కూడా మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఆ సినిమాలు ఏవి.? మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి అన్న సంగతి ఇప్పుడు చూద్దాం…జక్కన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నారు.
Advertisement
స్టూడెండ్ నంబర్ 1 సినిమా తరవాతనే ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించాలని అనుకున్నారు. మగధీర లాంటి హిస్టారిక్ సినిమాను ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో మోహన్ లాల్ వారియర్ గా కనిపించాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన స్కెచ్ లను కూడా ఆర్ట్ డైరెక్టర్ తో వేయించారు.
ఈ సినిమాను అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించాల్సి ఉండగా బడ్జెట్ కారణంగానే ఈ సినిమా పట్టాలెక్కకుండా ఆగిపోయింది. అంతే కాకుండా రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ హీరోగా జయసింహా పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని పారంభించారు. కానీ ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.