తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరును సంపాదించుకుంటున్నారు ఎస్.ఎస్ రాజమౌళి.. బాహుబలితో మొదలైన ఆయన పాన్ ఇండియా ప్రస్థానం, RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని చెప్పవచ్చు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో అనేక అవార్డులు తీసుకుంటూ ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు, రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు రావడం రాజమౌళి టాలెంట్ కు నిదర్శనం.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు రాజమౌళి.
Advertisement
నేను డబ్బు కోసమే సినిమాలు చేస్తాను గానీ, విమర్శకుల ప్రశంసల కోసం కాదని అన్నారు. కేవలం డబ్బు కోసం, ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తాను తప్ప విమర్శల ప్రశంసలు పట్టించుకోనని, rrr కమర్షియల్ చిత్రమని, కమర్షియల్ గా సినిమా వసూళ్లను సాధిస్తే చాలా ఆనందపడతానని, వీటితో పాటు అవార్డులు కూడా వస్తే నా సంతోషానికి అవధులు ఉండవని అన్నారు. మా యూనిట్ పడ్డ కష్టానికి నేను చాలా సంతోషంగా ఉన్నానని రాజమౌళి చెప్పారు. ఇక ఇటీవల మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా రాజమౌళి తన హాలీవుడ్ ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యారు.
Advertisement
also read:ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ కు దూరమైన అనసూయ…వెలుగులోకి సంచలన నిజాలు…?
అందరూ ఫిలిం మేకర్స్ లాగే నేను కూడా హాలీవుడ్ లో చిత్రం తీయాలని కలలు కంటున్నట్లు ఓపెన్ అయ్యారు. కానీ హాలీవుడ్ లో ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే బలమైన సహకారం అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇండియా సినిమా మేకింగ్ లో మాత్రం ఇతరుల డైరెక్షన్ అవసరం లేదని, గతంలో తనకు నచ్చిన “ఫిన్ ఆఫ్ పర్షియా” వీడియో గేమ్ సిరీస్ కు అనుగుణంగా దర్శకత్వం చేసేందుకు ఆసక్తి చూపారు.. ఇదిలా ఉండగా జనవరి 24న జరగనున్న ఆస్కార్ నామినేషన్ల ప్రకటనపైనే అందరి దృష్టిపడింది. ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ కోసం షార్ట్ లిస్టు చేయబడింది.. మరి చూడాలి RRR మూవీ ఇంకెన్ని అవార్డుల పంట పండిస్తుందో..
also read: