Telugu News » Blog » మనోజ్ చెప్పబోయే గుడ్ న్యూస్ అదేనా…?

మనోజ్ చెప్పబోయే గుడ్ న్యూస్ అదేనా…?

by AJAY
Ads

మంచు మోహన్ బాబు నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరో మనోజ్. మొదట నుండి మనోజ్ డిఫరెంట్ సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే డిఫరెంట్ కథల ఎంపిక వల్లనే స్టార్ హీరో అవ్వలేకోయాడు అనే ఆరోపణ కూడా మనోజ్ పై ఉంది. అంతే కాకుండా మంచు ఫ్యామిలీ పై కొందరు ట్రోల్స్ చేస్తూ ఉంటారు కానీ మనోజ్ పై ట్రోలింగ్ చాలా తక్కువగా ఉంటుంది.

Advertisement

అంతే కాకుండా పెద్ద హిట్ లు లేకపోయినా మనోజ్ ను అభిమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకున్న తరవాత సినిమా ల పై దృష్టి పెట్టలేకపోయాడు. దాంతో సినిమా కెరీర్ లో వెనక్కి వెళ్ళాడు. కొంతకాలం క్రితం అహం బ్రహ్మాస్మి అనే సినిమాను అనౌన్స్ చేశాడు.

Advertisement

Advertisement

కానీ ఆ సినిమా పై మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో మనోజ్…ముహూర్తం ఫిక్స్…రేపు ఉదయం 9:45 గంటలకు గుడ్ న్యూస్ చెబుతాను. మీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తున్నాను. అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

Manchu Manoj

Manchu Manoj