Home » ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ కు దూరమైన అనసూయ…వెలుగులోకి సంచలన నిజాలు…?

ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ కు దూరమైన అనసూయ…వెలుగులోకి సంచలన నిజాలు…?

by AJAY
Ad

జబర్దస్త్ షో ద్వారా తెలుగువారికి పరిచయమైన అనసూయ యాంకర్ గా ఎంతో సక్సెస్ అయ్యింది. సుమ తర్వాత తెలుగులో యాంకర్ గా మళ్లీ అంతటి గుర్తింపును సాధించింది. మొదట న్యూస్ రీడర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరవాత జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక జబర్దస్త్ షోలో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని కమెడియన్ లతో కలిసి పంచ్ లు విసిరి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

జబర్దస్త్ సక్సెస్ లో అనసూయ గ్లామర్ డోస్ కూడా ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక జబర్దస్త్ తర్వాత అనసూయ సినిమా ఆఫర్ లను సైతం అందుకుంది. క్షణం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో నటించి అలరించింది. ఈ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా వరుస ఆఫర్ లను అందుకుంది.

Advertisement

ప్రస్తుతం అనసూయ బుల్లితెర కంటే సినిమాలలోనే బిజీగా మారిపోయింది. ఇక ఎన్ని ఆఫర్ లు వచ్చినా అనసూయ చాలాకాలం పాటు జబర్దస్త్ లోనే కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ సడన్ గా అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన తరవాత మా టివిలో యాంకర్ గా సుధీర్ తో కలిసి ఓ షో చేసింది. అయితే ఆ షో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఓ ఇంటర్వ్యూలో అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడం వెనక అసలు కారణం బయట పెట్టింది.

తన ఇద్దరు కుమారుల కోసం సమయాన్ని కేటాయించడానికి జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్టు తెలిపింది. కొడుకుల కోరిక మేరకే జబర్దస్త్ వదులుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా జబర్దస్త్ లో అనసూయ కొనసాగడానికి రెమ్యూనరేషన్ పెంచుతామని సైతం ఆఫర్ చేశారట. అయినప్పటికీ ఆ ఆఫర్ ను సైతం అనసూయ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading