Home » మొదటి సారి కమర్షియల్ యాడ్ కి ఒప్పుకున్న రాజమౌళి.. అందులో అంత ఇంటరెస్టింగ్ ఏముంది?

మొదటి సారి కమర్షియల్ యాడ్ కి ఒప్పుకున్న రాజమౌళి.. అందులో అంత ఇంటరెస్టింగ్ ఏముంది?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఓటమిని ఎరుగని డైరెక్టర్ గా తెలుగు రంగ పరిశ్రమలో నిలిచినా దర్శక ధీర రాజమౌళి కి కూడా కెరీర్ పరంగా ఒడిదుడుకులు తప్పలేదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆయన ఇప్పటివరకు డైరెక్టర్ గానే కొనసాగారు. నటుడిగా అవకాశాలు వచ్చినా ఆసక్తి లేక వదులుకున్నారు. కొన్ని సినిమాల్లో తక్కువ నిడివి ఉన్న గెస్ట్ రోల్స్ మాత్రమే చేసారు.

rajamouli new

Advertisement

Advertisement

కనీసం అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఆయన ఎప్పుడు నటించలేదు. రాజమౌళి తన 22 సంవత్సరాల కెరీర్ లో తొలిసారిగా ఓ కమర్షియల్ యాడ్ లో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంతకీ ఆ యాడ్ దేని గురించో , అందులో అంత ఇంటరెస్టింగ్ విషయం ఏమి ఉందొ ఇప్పుడు చూద్దాం.

rajamouli 1

ఒప్పో ఫోన్ కంపెనీ మొబైల్ ఫోన్ ను స్టయిల్ గా అటు ఇటు తిప్పుతూ నడుస్తూ ఉన్న రాజమౌళి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లో రాజమౌళి క్రీం కలర్ సూట్ లో లుక్ ఇరగదీసాడు. ఒప్పో మొబైల్ ఫోన్ కంపెనీకి రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు.

Visitors Are Also Reading