Home » అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చింది. అందులో ముఖ్యమైనవి రైతుబంధు మరియు రైతు బీమా. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయంగా రైతాంగానికి ఇస్తోంది కేసీఆర్ సర్కార్. ఈ పథకాన్ని దాదాపు 8 సంవత్సరాలుగా అమలు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Advertisement

మొదట్లో ఎకరా 8000 రూపాయలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… దాన్ని పదివేల రూపాయలకు పెంచింది ప్రభుత్వం. అయితే… ఈ పథకానికి ఎలాంటి అంచులు పెట్టలేదు ప్రభుత్వం. ఒక ఎకరం ఉన్న రైతుకు రైతుబంధు వస్తోంది… అలాగే 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతుబంధు వస్తోంది. ఈ పథకంలో ఇదొక్కటే సమస్య ఉంది. దీంతో ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే రైతుబంధు ఇవ్వాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ వస్తోంది.

Advertisement

ఇది ఇలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా రైతుబంధు లబ్ధిదారుడే. ఆయన కూడా ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతుబంధు తీసుకుంటున్నాడు. అయితే దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు చేశారు. అడ్డగోలుగా ఆస్తులు ఉన్న అక్కినేని నాగార్జునకు రైతుబంధు డబ్బులు అవసరమా ? అలాంటి వ్యక్తికి కూడా రైతుబంధు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఫైర్ అయ్యారు. మామూలు రైతుకు ఇలాంటి పథకాలు ఇవ్వాలి కానీ… ఇలా క్యాష్ పార్టీ వ్యక్తులకు అసలు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి : 

భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!

రేణు దేశాయ్ కి అంబటి కౌంటర్.. నువ్వు నిజమైన భారతీయ మహిళవు !

ఫ్యాన్స్ కు షాక్…క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై…?

Visitors Are Also Reading