వర్షాకాలంలో వర్షాలు కురవడం అనేది కామన్. ఆ సమయంలోనే నదులు, సరస్సులు ఫుల్ గా నీటితో నిండిపోతుంటాయి. ఈ సీజన్ హాయిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ.. హడలు పుట్టించే వ్యాధులను కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఈ సీజన్ మొదలయ్యేటప్పటికీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదలు పెట్టాలి. లేదంటే సూచనలేని వర్షాల కారణంగా వ్యాధుల బారిన పడక తప్పదు.
Advertisement
ముఖ్యంగా మనం తీసుకునే ఆహరం, తాగే మంచినీళ్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వర్షాల వలన నీరు మారుతుంటుంది. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటి బారిన పడుతుంటాము. ఈ సీజన్లో ఎక్కువగా కామెర్ల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన వారు రోజు రోజుకు బరువు తగ్గిపోతుంటారు. శరీరం, కళ్ళు పసుపు రంగులోకి మారిపోతుంటాయి. ఈ వ్యాధి వలన రక్తంలో బిలిరుబిన్ విడుదల అవుతుంది.
Advertisement
ఈ వ్యాధి సోకిన వారు ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. ముఖ్యంగా అరటిపండును దూరం పెట్టాలి. కామెర్లు సోకిన వారికి జీర్ణక్రియ క్షీణిస్తుంది. ఈ సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉన్న అరటిపండు తినడం వలన ఇబ్బంది పడాలి. కాఫీ, టీలకు కూడా వీరు దూరంగా ఉండాలి. అలాగే పంచదార ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయ సమస్యలు వస్తాయి. అందుకే ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని..
టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!
తిలక్ వర్మ అన్ని ఫార్మట్స్ లో భారత్ కు ఆడుతాడు..!