తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ పూర్తిగా ఖరారైంది. వరంగల్ లో ఈ నెల ఆరవ తేదీన రైతు సంఘర్షణ నిర్వహించనున్నారు. ఈ సభ తర్వాత నేరుగా రాహుల్ గాంధీ హైదరాబాద్ లోకి వచ్చి కోహినూర్ హోటల్ లో బస చేస్తారు. రాహుల్ పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, అలాగే టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభను తలపెట్టింది.
Advertisement
Advertisement
ఈనెల ఆరో తారీఖున ఈ సభను పూర్తిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. అయితే రాహుల్ పర్యటన సందర్భంగా ఆదివారం పూర్తి షెడ్యూల్ ఖరారైంది. ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన చేయడానికి అనుమతి లేకపోవడంతో టిపిసిసి నాయకులు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనపై మరోసారి మాట్లాడడం కోసం వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా కోపానికి వచ్చారు..
ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పాశవిక పాలనకు అద్దం పడుతుందని అన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి జగ్గారెడ్డి వెళితే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పర్యటన ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని, అందుకే ఈ విధంగా అరెస్టు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ పర్యటన జరుగుతుందని హెచ్చరించారు.