Home » 140 కిలోల బరువు.. తొలి బంతికే పరుగెత్తి రనౌట్‌ అయిన విండీస్‌ బాహుబలి..

140 కిలోల బరువు.. తొలి బంతికే పరుగెత్తి రనౌట్‌ అయిన విండీస్‌ బాహుబలి..

by Bunty
Ad

పాకిస్తాన్ దిగ్గజ బ్యాట్స్మెన్ ఇంజమామ్ ఉల్హక్ గురించి క్రికెట్ పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇంజమామ్ ను అభిమానిస్తారు. ఒక ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇంజమామ్ క్రిజ్ లో నిలబడితే ప్రత్యర్థికి అంత ఈజీగా లొంగేరకం కాదు. చూడడానికి బబ్లీగా ఉండే ఇంజమామ్ అలవోకగా సిక్సులు బాదేవాడు. అయితే ఈ విధ్వంసకరుడికి వికెట్ల మధ్య పరుగెత్తడం అంటే ఇష్టం ఉండదు.

Advertisement

భారీకాయుడు అయిన ఇంజమామ్ సింగిల్ తీసేవాడు కాదు. కానీ ఫోర్లు, సిక్స్ లు, సిక్సర్లతో హడలెత్తించేవాడు. క్రికెట్ లో ఇంజమామ్ ను బాహుబలిగా పోలిస్తే.. ఇప్పుడు వెస్టిండీస్ క్రికెటర్ రకీమ్ కార్న్ వాల్ ను బాహుబలి డాడీగా పోలుస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ నడుస్తుంది. సెయింట్ లూసియా, బార్బోడోస్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ లో ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. బార్బడోస్ రాయల్స్ తరపున ఆడుతున్న కార్న్ వాల్ రన్ అవుట్ అయిన తీరు ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తోంది.

Advertisement

కార్న్ వాల్ కొట్టిన ఒక షాట్ ఫీల్డర్ అందుకోలేకపోవడంతో నాన్ స్ట్రైక్ లో ఉన్న కైల్ మేడ్స్ రన్ కోసం పరుగులు తీశాడు. దీంతో కార్న్ వాల్ పరిగెత్తాల్సి వచ్చింది. భారీ కాయుడైన కార్న్ వాల్ వేగంగా ఉరకలేక చేతులెత్తేశాడు. ఫీల్డర్ డైరెక్ట్ త్రో చేయడంతో కార్న్ వాల్ రన్ అవుట్ గా వెనిదిరిగాడు. ఈ రన్ అవుట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతన్ని ఇంజమామ్ తో పోలుస్తున్నారు. నిజానికి కార్న్ వాల్ స్థానంలో మరో ఆటగాడు ఉండి ఉంటే సునాయాసంగా పరుగులు తీసేవాడు. ఏమాత్రం అవుట్ అయ్యే ఛాన్స్ కాదు అది. కానీ అక్కడ ఉన్నది కార్న్ వాల్ కాబట్టి రన్ అవుట్ కాక తప్పలేదు.

ఇవి కూడా చదవండి 

సీఎం జగన్‌ ను తెలంగాణ వాళ్లు..రాళ్లతో తరిమి కొట్టారు – పవన్‌ కళ్యాణ్‌

Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?

Kushi: ఖుషి సినిమాకు విజయ్ – సమంత రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?

Visitors Are Also Reading