కొంతమంది నటులు వందల సినిమాలు చేసినా ప్రేక్షకుల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకోలేరు. కానీ కొంతమంది నటులు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి నటులలో రఘువరున్ కూడా ఒకరు. విలన్ పాత్రలలో నటించి బయపెట్టిన రఘువరున్ ఆ తరవాత ఎమోషనల్ పాత్రల్లో నటించి ఏడ్పించారు కూడా.
Advertisement
రఘువరున్ వాయిస్ లో ఉండే బేస్ ఆయన నటన వేరే లెవల్ అనే చెప్పాలి. రఘువరున్ తెలుగుతో పాటూ తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలోనూ నటించాడు. మొత్తం తన కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. రఘువరున్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నటి రోహిణి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Advertisement
వీరికి రిషివరున్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో ఆ తరవాత విడాకులు తీసుకున్నారు. తెలుగులో శివ, పసివాడి ప్రాణం సినిమాలు రఘువరున్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రఘువరన్ అన్ని రకాల పాత్రల్లో నటించినా విలన్ గా ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అప్పట్లో విలన్ గా డేట్స్ ఇవ్వలేనంత బిజీ అయిపోయారు.
కానీ కొంతకాలానికి అవకాశాలు తగ్గడంతో మద్యానికి బానిసయ్యారు. చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. అంతే కాకండా తన ఆరోగ్యం పాడవుతుందని తాను ఎలాగైనా చనిపోతానని తెలిసిన రఘువరున్ తన స్నేహితులందరినీ ఇంటికి పిలిచి చనిపోయే కొద్దిరోజుల ముందే పార్టీ కూడా ఇచ్చారు. అలా పార్టీ ఇచ్చి కొద్దిరోజులకే ఆయన మరణించారు. ఏది ఏమైనా రఘువరున్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది.