నటుడు రఘువరన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సినిమాల్లో రఘువరన్ నటించి మంచి మార్కులను కొట్టేసేవాడు. రఘువరన్ ఒక ప్రేమికుడిగా, విలన్ గా, మంచి తండ్రిగా, కమెడియన్ గా ఇలా ఏ పాత్రకైనా సరే ఇట్టే సెట్ అయిపోయేవారు. శివ సినిమాలో భవానీ పాత్ర, భాషా సినిమాలో ఆంటోనీ పాత్ర, సుస్వాగతం లో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి. అయితే ఎప్పుడు రాని రఘువరన్ సోదరుడు రమేష్ తొలిసారి మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రఘువరన్ మృతికి గల కారణాలు ఏంటో ఆయన చెప్పుకొచ్చారు.
Advertisement
Advertisement
రఘువరన్ నటి రోహిణి ని పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. రఘువరన్ కి మందు అలవాటు ఉంది దానివల్లనే భార్యతో విడిపోవలసి వచ్చింది. అయితే ఇద్దరు విడిపోయిన తర్వాత కోర్టు పర్మిషన్ ప్రకారం ప్రతి శనివారం రఘువరన్ దగ్గరికి కొడుకు వచ్చేవాడు. అయితే కేవలం శనివారం మాత్రమే తన కొడుకు వస్తున్నాడని ఆరోజే నాన్న అనే పిలుపు వినపడుతోందని లోలోపల రఘువరన్ కృంగిపోయాడట. అలా కొడుకు నుండి దూరం అయిపోయాక కొడుకుని తలుచుకుంటూ విపరీతంగా మందు తాగేవాడు అలా తాగుతున్నప్పుడు ఒకరోజు గుండెల్లో విపరీతమైన నొప్పి వచ్చి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ అప్పటికే చనిపోయారని రఘువరన్ సోదరుడు చెప్పారు.
Also read:
- ఇంట్లో హనుమాన్ ఫోటో ని పెట్టుకోవాలంటే.. వీటిని తప్పక పాటించాలి..!
- బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు.. ఈ పనులు ఖచ్చితంగా చెయ్యండి..!
- చాణక్య: నిజమైన మిత్రుడుకి, శత్రువుకి తేడా ఏమిటి..?