సినిమా : రాధేశ్యామ
నటీనటులు : ప్రభాస్, పూజాహెగ్డే, సత్యారాజ్, కృష్ణం రాజు
Advertisement
దర్శకుడు : రాధాకృష్ణ
నిర్మాణసంస్థ : యూవీక్రియేషన్స్
మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్
సినిమా నిడివి : 2 గం 18 నిమిషాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధేశ్యామ్. సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటించగా జిల్ సినిమా ఫేం రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాహుబలి, సాహో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరవాత ప్రభాస్ రాధే శ్యామ్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది. కథ కథనాలు… ప్లస్ లు మైనలు..సినిమా హిట్టా ఫట్లా అనేది ఇప్పుడు చూద్దాం….
కథ
ఈ సినిమా కథ 1976 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఇండియాలోనే పాపులర్ హస్త ముద్రికుడు ప్రభాస్ విక్రమాధిత్య. విక్రమాధిత్య ఇటలీకి వెళ్లిన సమయంలో అక్కడ ప్రేరణ పూజా హెగ్డే ను కలుస్తాడు. ఆ తరవాత వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. అలా ప్రేమలో పడిన విక్రమాధిత్య ప్రేరణల లవ్ లో ఎన్నో ఇబ్బందులు అవాంతరాలను ఎదురుకోవాల్సివస్తుంది. వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులేంటి…వాటిని ఎలా అధిగమించగలిగారు అన్నదే రాధేశ్యామ్ కథ.
Advertisement
సినిమా ఎలా ఉంది ప్లస్ లు మైనస్ లు :
అత్యంత భారీ విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ గా నిలిచింది. తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్ కు తీసుకువెళుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో ప్రభాస్ నటనకు వంద మార్కులు వేయవచ్చు. సినిమాలో ఎలాంటి మాస్ సీన్లు లేకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశపర్చవచ్చు…కానీ కథ పరంగా చూసినట్లయితే మాస్ సీన్ల అవసరం ఉండదు. పూజా హెగ్డే కూడా తన నటనతో ఆకట్టుకుంది. పూజా ప్రభాస్ మధ్య వచ్చే సీన్లు….ఇద్దర మధ్య కెమిస్ట్రీ ఎంతో బాగున్నాయి. సినిమాలో కృష్ణం రాజు కీలక పాత్రలో నటించి తన పాత్రకు న్యాయం చేశారు…..సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజువల్ వండర్ గా నిలిచిన ఈ సినిమా కథనం పరంగా ఆశించినంతగా లేదు. కథ కూడా పాతదే అనే ఫీలింగ్ వస్తుంది. కథను సాగదీయండంతో ప్రేక్షకుడికి కొన్ని సీన్లు చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. అంతే కాకుండా సినిమాలో కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉండటం కూడా మైనస్ అనే చెప్పాలి. భారీ అంచనాలతో సినిమాకు వెళితే మాత్రం ప్రేక్షకులు నిరాశ చెందక తప్పదు. కానీ కూల్ ప్రేమకథను ఇష్టపడేవారికి రాధేశ్యామ్ బాగా కనెక్ట్ అవుతుంది.
Also Read: ప్రభాస్ “రాధేశ్యామ్” స్టోరీ లీక్….చివరి 20నిమిషాల కథ ఇదేనట…!