పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించగా సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో పామిస్ట్రీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక మార్చి 11న ఎన్నో అంచనాల మధ్యన ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయినప్పటికీ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురుస్తోంది. ఫస్ట్ డే ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఓవర్సీస్ లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమా ప్రీమియర్ తోనే 904 కే డాలర్ల కలెక్షన్ లు రాబట్టినట్టు సమాచారం.
Advertisement
Advertisement
విదేశాల్లోనూ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమా మొదటి రోజు బుకింగ్స్ భారీగా జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ కు రూ.30 కోట్ల కలెక్షన్ లు వచ్చినట్టు టాక్. నైజాంలో మొదటి రోజు 11.87 కోట్లు….ఆంధ్రాలో రూ.8.5 కోట్ల కలెక్షన్ లు వచ్చినట్టు టాక్. మరోవైపు బాహుబలి సినిమాతో బాలీవుడ్ లోనూ ప్రభాస్ క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడ కూడా భారీగానే కలెక్షన్లను రాబట్టారట.