బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తరవాత ప్రభాస్ సాహో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రం తరవాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది.
Advertisement
ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ టీజర్ లలోనూ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలు కనిపిస్తున్నాయి. నిజానికి సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఇటలీకి వెళ్లింది. కానీ కరోనా ఉదృతి నేపథ్యంలో తిరిగి ఇండియాకు వచ్చింది.
Advertisement
ఇక ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కాకుండా హైదరాబాద్ లోనే ఇటలీ నగర సెట్ లను వేసి చిత్రీకరణ జరిపారు. ఈ విషయాన్ని సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా ఈ భారీ సెట్స్ కోసం ఏకండా రూ. 101 కోట్లు ఖర్చు చేశామని రవీందర్ రెడ్డి తెలిపారు. అయితే సినిమాలో ఎక్కడా కూడా ఇది ఇటలీ కాదు అనే ఆలోచన రాకుండా సెట్స్ ను నిర్మించామని ఆయన తెలిపారు.
సెట్ వర్క్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా సినిమాలకు భారీ సెట్స్ ను వేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం కోసం విలేజ్ సెట్ ను వేశారు. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ కోసం కూడా బెంగాల్ సెట్ ను వేశారు. అంతే కాకుండా చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య కోసం కూడా భారీ టెంపుల్ సెట్ ను వేసిన సంగతి తెలిసిందే.