సాధారణంగా హీరో కొడుకు హీరోనే అవుతాడన్నది సామెత. అందుకు తగ్గట్లుగానే చిన్నప్పటి నుంచి నటనలో ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ ఇలా అన్నింట్లోనూ శిక్షణ ఇప్పించి తీర్చిదిద్దుతారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, సాండల్ వుడ్, మాలీవుడ్ ఇలా ఎక్కడైనా ఇదే తంతు. అందుకే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులే పరిశ్రమను ఏలుతున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు స్టార్స్.
అయితే తమిళ స్టార్ హీరో మాధవన్ మాత్రం… అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించారు. తన కొడుకు వేదాంత్‌ను క్రీడాకారుడిగా దేశం తరపున ఆడితే చూడాలనుకుంటున్నారు. వేదాంత్ ఇప్పటికే నేషనల్ లెవల్ స్విమ్మింగ్ ఛాంపియన్. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పలు మెడల్స్ ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2026లో జరగనున్న ఒలంపిక్స్‌లో ఏకంగా భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ఇంతటి ఘనత సాధించిన కొడుకు కోసం కష్టపడుతున్నాడు మాధవన్. కోవిడ్ ఆంక్షల కారణంగా భారత్‌లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేవు. దీంతో వేదాంత్ శిక్షణ, ప్రాక్టీస్ కష్టమైంది. దీనిని గమనించిన మాధవన్ కొడుకు సమస్యను పరిష్కరించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా భార్య సరిత, కుమారుడు వేదాంత్‌లతో కలిసి దుబాయ్ వెళ్లాడు.
Advertisement
Advertisement
తన బిడ్డకి సినిమాల పట్ల ఆసక్తి లేదని.. అందుకే తను ఇష్టపడిన రంగంలోనే ప్రోత్సహిస్తున్నాం అని మాధవన్ చెబుతున్నాడు. తన కొడుకు స్మిమ్మింగ్‌లో ప్రపంచ స్థాయిలో పతకాలు గెలుస్తున్నాడని.. తల్లిదండ్రులుగా మేము, భారతదేశం గర్వపడేలా చేస్తున్నాడని పొంగిపోతున్నాడీ రొమాంటిక్ హీరో. అతని కల నెరవేరాలని.. వేదాంత్ దేశం తరుపన ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలని మనం కూడా కోరుకుందాం.
https://www.instagram.com/p/CJN9LfwjtuD/?utm_source=ig_embed&ig_rid=072807b4-e719-460d-acac-c2a3fb524581