నామినేటెడ్ కార్పొరేషన్ పోలీసుల్లో బీసీలకి 50% పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని కోరుతూ ఈ లేఖ ని రాసినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. శుక్రవారం బిసి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలు చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్, దేవాదాయ కమిటీలు అలానే ఇతర నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారట.
Advertisement
Advertisement
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలు మద్దతు ఇచ్చారని అలానే పార్టీలోని సమర్ధులైన నాయకులకి పదవులు ఇవ్వాలని కోరామని చెప్పారు. వచ్చే బడ్జెట్లో బీసీలకు 20వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు మంజూరు చేయాలని బీసీ బందు పథకం ప్రవేశపెట్టి బిసి ఫ్యామిలీ లకి 20 లక్షలు మంజూరు చేయాలని ఉంది అలానే మంత్రివర్గంలో 50% కోట బీసీలకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామని ఆర్ కృష్ణయ్య అన్నారు. సీఎం ప్రకటించిన నలుగురు ప్రభుత్వ సలహాదారులతో ఒక్కరూ బీసీలు లేకపోవడం బాధాకరమని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!